పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ఆమోదం !

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సమావేశం ముగింసింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఆర్ధిక వ్యవస్థపై కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇక పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపింది.

2021 సంవత్సరానికిగాను 100 రోజుల ఛాలెంజ్ పేరుతో రాష్ట్రాలకు పీఎంఏవై-యూ అవార్డులు కేంద్రం ప్రధానం చేయనుంది. ఇప్పటివరకు మంజూరు చేసిన 1.12 కోట్ల గృహాలలో 82.5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్టు వెల్లడించింది. కాగా కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సిన్ల సేకరణ వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. కరోనాపై పోరాటంలో సార్వత్రిక వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకొనేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.  దీనిలో భాగంగా 44 కోట్ల డోసులకు పైగా ఆర్డర్ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్ కొవాగ్జిన్ కోసం మంగళవారం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. సీరమ్ ఇన్స్టిట్యూట్కు 25 కోట్లు భారత్ బయోటెక్కు 19  కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. మొత్తంగా ఈ 44 కోట్ల టీకా డోసులు డిసెంబర్ కల్లా అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.

1,235 thoughts on “పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ఆమోదం !

Leave a Reply to best online pharmacy for viagra Cancel reply

Your email address will not be published. Required fields are marked *