భార్యతో విడాకులు.. మైనర్‌పై లైంగిక దాడి!

వివాహమైంది… భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఓ మైనర్‌పై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడో కామాంధుడు. బంజారాహిల్స్‌కు చెందిన కె రాజేష్‌ డ్రైవర్‌. కొద్ది కాలం క్రితం ఓ యువతిని వివాహం చేసుకొని విడాకులిచ్చాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని(14)తో పరిచయం ఏర్పరచుకొని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అనంతరం ఓ గదిలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి వచ్చిన బాలికకు తీవ్రకడుపు నొప్పి వచ్చింది. తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం చెప్పింది. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

9,495 thoughts on “భార్యతో విడాకులు.. మైనర్‌పై లైంగిక దాడి!