‘బోర్డర్‌-గవాస్కర్‌’కే అభిమానుల ఓటు

గతేడాది భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులను అలరించింది. అందుకే 2-1తో టీమిండియా గెలుచుకున్న ఈ సిరీస్‌ను అభిమానులు ‘అల్టిమేట్‌ టెస్టు సిరీస్‌’గా ఎంపిక చేశారని ఐసీసీ వెల్లడించింది. ‘డబ్ల్యుటీసీ ఫైనల్‌కు ముందు ది అల్టిమేట్‌ టెస్టు సిరీస్‌ను ప్రకటిస్తున్నాం. ఏడు మిలియన్లకు పైగా ఓటింగ్‌.. పోటీలో 15 సిరీస్‌లు.. చివరికి 2020-21 బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకే కిరీటం దక్కింది’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. ఈ ఓటింగ్‌ ఫైనల్లో 1999 భారత్‌-పాక్‌ సిరీస్‌ గట్టి పోటీనే ఇచ్చింది. కెప్టెన్‌ కోహ్లీ తొలిటెస్టు తర్వాత స్వదేశానికి రావడం.. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా రహానె నేతృత్వంలో టీమిండియా అసమాన పోరాటంతో ఆ సిరీస్‌ గెలిచింది.

11,343 thoughts on “‘బోర్డర్‌-గవాస్కర్‌’కే అభిమానుల ఓటు