మినరల్ వాటర్ అనుకుని యాసిడ్ తాగి.. తహసీల్దార్ అస్వస్థత

మినరల్ వాటర్ అనుకుని పొరపాటున యాసిడ్ తాగిన ఓ తహసీల్దార్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. షాపు యజమాని తప్పిదం కారణంగా ఇది జరిగింది. మినరల్ వాటర్ బాటిల్‌లో  ఉన్న యాసిడ్‌ను పొరపాటున మంచి నీళ్లుగా భావించిన షాపు యజమాని దాన్ని తహసీల్దార్‌కు అమ్మాడు. దాన్ని తాగిన బాధితులు ఆస్వస్థతకు గురయ్యాడు. దాహం వేస్తే మినరల్ వాటర్ అడిగానని అయితే..షాపులోని వ్యక్తి మాత్రం తనకు మినరల్ వాటర్‌లా కనిపిస్తున్న బ్యాటరీ యాసిడ్ ఇచ్చాడని బాధితుడు నియాజ్ అహ్మద్ తెలిపారు. ‘‘అది తాగడంతో కడపులో ఇబ్బందిగా అనిపించి వెంటనే ఆస్పత్రిలో చేరాను’’ అని నియాజ్ చెప్పాడు. అయితే..నియాజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తేల్చిన వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. కాగా.. షాపు యజమానిని అరెస్టు చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.