పాక్ ప్రధానితో సంభాషణ అంటే..చెవిటి వాళ్లలో

సింధ్ ప్రావిన్స్‌ పట్ల పాక్ ప్రధాని పక్షపాతం వహిస్తున్నారని సింధ్ ప్రావిన్స్ సీఎం మురాద్ అలీ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడినా ఆయనకు లేఖలు రాసినా ఆశించిన స్పందన రాదని, ఆయనతో సంభాషణ చెవిటి వారితో మాట్లాడినట్టు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తన ప్రావిన్స్‌లో అభివృద్ధి జరగట్లేదంటూ ఆయన సోమవారం నాడు ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ రాశారు. సింధ్ పట్ల ఆయన నిస్సిగ్గుగా పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని, అక్కడి ప్రజలను అసలేమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సింధ్‌లో చేపట్టాల్సిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇమ్రాన్ ఖాన్ కారణంగా ఆలస్యం అవుతున్నాయని మండిపడ్డారు. దేశంలోని సంపద సృష్టిలో 70 శాతం సింధ్‌లోనే జరుగుతున్నా ఈ ఏడాది కేవలం రెండు ప్రాజెక్టులే మంజూరయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రావిన్స్‌లకు మాత్రం 10కి మించి ప్రాజెక్టులు మంజురైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 

12,315 thoughts on “పాక్ ప్రధానితో సంభాషణ అంటే..చెవిటి వాళ్లలో