వారివి అలాంటి ఆలోచనలే.. రేవంత్ ట్వీట్‌పై జగదీశ్ రెడ్డి

ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి జగదీశ్ రెడ్డి లక్ష్యంగా ట్వీట్ చేయడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. చెత్త మనుషులకు, చెత్త ఆలోచనలే ఉంటాయని.. అలాంటి విషయాలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

పెను దుమారం..

రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా చేసిన ట్వీట్‌ నెట్టింట సరికొత్త చర్చకు దారితీసింది. ఓ పత్రికా కథనాన్ని ఆధారం చేసుకుని.. మంత్రి జగదీశ్ రెడ్డిపై రేవంత్ సెటైర్లు వేశారు. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…? అంటూ ఆ ట్వీట్ సాగింది. ఈ ట్వీట్‌లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశిస్తూ చేసినట్టుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబోతోందనడానికి ఈ ట్వీట్ సూచిక అంటున్నారు.

పేరుకు బర్త్ డే వేడుకలు

గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరిపారని ట్వీట్‌కు జత చేసిన పత్రికా కథనం తెలుపుతోంది. ఈ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని, పేరుకు పుట్టిన రోజు వేడుకలైనా.. అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచ్చినట్టుగా వార్తా కథనంలో ఉంది. కేటీఆర్‌ను సీఎం చేయడం, ఈటల కొత్త పార్టీ తదితర అంశాలపైనే చర్చించినట్టుగా కథనాన్ని రాశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ట్వీట్ ఆసక్తి రేకెత్తించింది.

17,885 thoughts on “వారివి అలాంటి ఆలోచనలే.. రేవంత్ ట్వీట్‌పై జగదీశ్ రెడ్డి