అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి రాహుల్ సన్నిహితుడు

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాహుల్ గాంధీకి అత్యం సన్నిహితుడు, మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

జాతీయ పార్టీ అంటే బీజేపీనే అంటూ జితిన్ ప్రసాద

అనంతరం జితిన్ ప్రసాద మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ పార్టీతో మూడు తరాల అనుబంధం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా చర్చించాల్సి వచ్చిందన్నారు. గత 8-10ఏళ్లుగా జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమేనని తనకు అనిపించిందని తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ, ప్రజల తరపున నిలబడే పార్టీ బీజేపీనేనని అన్నారు. అందుకే తాను ఈ పార్టీలో చేరినట్లు జితిన్ ప్రసాద్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జితేంద్ర ప్రసాద కుమారుడే జితిన్ ప్రసాద. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావుకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. 1999లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జితేంద్ర.. సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. కాగా, ప్రస్తుతం 47ఏళ్ల జితిన్ ప్రసాద యూపీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. 2004లో షాజహాన్‌పూర్, 2009లో దౌరహ్రా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా, కాంగ్రెస్ అధినాయకత్వంలో సంస్కరణలు తీసుకురావాలంటే జీ-23 కాంగ్రెస్ సభ్యుల బృందంలో జితిన్ కూడా ఒకరు కావడం గమనార్హం. అంతేగాక, రాహుల్ గాంధీ సన్నిహితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడిన రెండో ప్రముఖ వ్యక్తి ఈయనే. మొదటి వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.

2,610 thoughts on “అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి రాహుల్ సన్నిహితుడు